నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారు
వెబ్ న్యూస్,బతుకమ్మ : నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని, సొంత ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. లక్ష, రెండు లక్షల పనులకు కూడా ఎమ్మెల్యేల వద్ద నిధులు లేవని ఆవేదన వ్యక్తం చే శారు. ఎమ్మెల్యేలుగా మా పరిస్థితి చెప్పుకోలేకుండా దారుణంగా ఉందన్నారు. పెళ్లికి, పేరంటానికి, చావులకు పోవుడు తప్ప చేసేది ఏం లేదని వ్యాఖ్యనించారు.