ఎస్సెస్సీ టాపర్లను సన్మానించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : పదవ తరగతి 2024 - 2025 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు...