వేల్పూర్, బతుకమ్మ :
వేల్పూర్ మండలం లో అంక్సాపూర్ గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి (సంత మల్లన్న)ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. మల్లన్న సట్టి ఉత్సవాలు,జాతరను పురస్కరించుకుని సోమవారం స్వామి వారిని దర్శించుకొని స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అర్చకులు, స్థానిక వీడీసీ శేష వస్త్రం తో సన్మానించారు. స్థానికులతో ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు.
