ఎమ్మెల్యే వేముల అధికారిక కార్యక్రమాలు వాయిదా

భీమ్ గల్, బతుకమ్మ: భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో తన అధికార కార్యక్రమాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. తదుపరి తేదీని మళ్లీ తెలుపుతామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడి చేసి ఉగ్రవాదులను మట్టు బెట్టిన ఘటనను భారతీయుడిగా తాను సమర్థిస్తూ గర్విస్తున్నానని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది...