వడ్ల కొనుగోలుపై కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : వడ్ల కొనుగోలు లో జరుగుతున్న జాప్యం పై కలెక్టర్ తో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు లో జాప్యం జరుగుతోందని, లారీల ద్వారా ధాన్యం రైస్ మిల్స్ కు ట్రాన్స్పోర్ట్ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆయన జిల్లా కలెక్టర్ కు ఫోన్ లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.