. . . కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే నిర్ణయం
నిజామాబాద్, బతుకమ్మ:
కళ్యాణ లక్ష్మి , షాది ముభారక్ చెక్ ల పంపిణి బహిష్కరిస్తున్నట్టు మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు లేఖ రాసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కళ్యాణ లక్ష్మి , షాది ముభారక్ లో భాగంగా లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పడని తెలిపారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిన హమీ అమలు చేయకుండా మాట తప్పినంధుకు చెక్ ల పంపిణి బహిష్కరిస్తున్నట్టు మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చెక్ ల పంపిణిని పంచాయతి కార్యధర్శుల ద్వార పంపిణి చేయాలని కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కోన్నారు.