Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 11:13 am Posted by : ramakrishna

అనారోగ్యంతో బాధ పడుతున్న మహిళకు చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా

 రెండు లక్షల ఎల్ ఓసీ అందచేసిన వేముల

 వేల్పూర్, బతుకమ్మ:

వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన యం.రమణి అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల ఎల్ ఓసీని అందచేశారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు ₹2 లక్షల రూపాయల ఎల్వొసి  మంజూరు చేయించి ఎల్ ఓసీ కాపీ ని వారి కుటుంబ సభ్యులకు  హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన తమకు మెరుగైన వైద్య చికిత్స కొరకు ₹2 లక్షల రూపాయల ఎల్ఓసి  మంజూరు చేశారని ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసారు.