చదువుకున్న బడికి ఎమ్మెల్యే రూ.50వేలు అందజేత
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :తాను చిన్నప్పుడు చదువుకున్న బడికి ఎంతో కొంత సహాయం చేయాలనే తపనతో తాను పుట్టి పెరిగి తాను చదువుకున్న గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల లో టీచర్ల కొరత తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రయివేట్ టీచర్ ల వేతనం కోసం రూ.50...