సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట 

బతుకమ్మ, మద్నూర్: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/- మద్దతు ధర ప్రకటించిందని రైతులు అందరూ సోయా బీన్ పంటను మద్నూర్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు. ఎకరాకు 9 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నందున.. ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే ఉన్న కొనుగోలు నిబంధనను సడలించి పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేసే విధంగా...