ఇందిరా గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే తోట నివాళులు
జుక్కల్, బతుకమ్మ : భారత మాజీ మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా...