జుక్కల్, బతుకమ్మ: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపికకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు భారత దేశంలో మొట్ట మొదటి సారి అత్యంత పారదర్శకంగా కార్యకర్తల అభిప్రాయం సేకరించి ,జిల్లా అధ్యక్షుని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అందరూ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించడం కోసం ప్రతి జిల్లాకి ఒక అబ్జర్వర్ ను, ఇంచార్జిని నియమించడం జరిగిందన్నారు.