అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ లో విలువ రూ.44 లక్షలతో నిర్మించిన అదనపు గదులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్లాస్ రూమ్స్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకెళ్లాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జుక్కల్ నియోజకవర్గంలో విద్యా...