జర్మన్ పార్లమెంట్ వ్యాపార ప్రతినిధి బృందంతో ఎమ్మెల్యే తోట భేటీ

బతుకమ్మ, మద్నూర్: స్టేట్ పార్లమెంట్ అధ్యక్షుడు హెండ్రిక్ హెరింగ్ నేతృత్వంలో జర్మన్ పార్లమెంట్ వ్యాపార ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విధానాలు, పథకాలు, ఉపాధి, పెట్టుబడులు తదితర అంశాల గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.