కేంద్ర సహాయ మంత్రితో ఎమ్మెల్యే తోట భేటీ

జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని, జుక్కల్ నియోజకవర్గాన్ని సందర్శించేందుకు రావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.