Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 7:51 pm Posted by : ramakrishna

కేజీబీవీ పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

 

నిజాంసాగర్, బతుకమ్మ :

 

నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సందర్శించి పాఠశాల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటిస్తూ వారి విద్యాభివృద్ధి, వసతులు, భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పాఠశాలలో ఉన్న కొన్ని సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

MLA Thota Lakshmi Kantharao visited KGBV school