విద్యార్థులకు షూ పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బతుకమ్మ, బిచ్కుంద : కామ్రేడ్ జిల్లా డోంగ్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థులకు షూ డొనేట్ చేసిన శివరాజ్ పటేల్ కి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులను చూస్తుంటే దేశ భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. విద్యార్ధి దశ అతి ముఖ్యమైనదని, విద్యార్థులందరూ బాధ్యతగా విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి పురోగతికి, సమాజం మరియు...