Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 3:47 pm Posted by : ramakrishna

మన్మథ్ స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్, బతుకమ్మ : నియోజకవర్గ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ మన్మథ్  స్మామిని దర్శించుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు. భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా వెళ్తున్న సద్గురు సోమాయప్పని మార్గమధ్యలో కలిసి పూజలు నిర్వహించి సోమాయప్ప ఆశీర్వాదం తీసుకొని వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కపిల్ దార్ కు చేరుకొని మన్మథ్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కువ సంఖ్యలో వెళ్లి మన్మథ్ స్వామిని దర్శించుకున్నారు.

MLA Thota Lakshmi Kantarao visits Manmath Swamy