Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 8:09 pm Posted by : ramakrishna

జిల్లా కలెక్టర్ తో సమావేశమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బతుకమ్మ, మద్నూర్ :

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ  సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, పోలీసు అధికారులు, జిల్లా అధికారులతో  మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని అర్హులకు పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులు,రోడ్లు,అభివృద్ధి పనులు,పోడు భూముల సమస్యలు, సీజనల్ వ్యాధులు ఇతర సమస్యల గురించి వారితో చర్చించారు.