Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 3:51 pm Posted by : ramakrishna

ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల వీధి నిర్వహణలో వీర మరణం పొందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి రావాల్సిన ఉద్యోగ విషయమై కలెక్టర్, సీపీతో మాట్లాడారు. అనంతరం ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపరిడెంట్ తో మాట్లాడారు. వీధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేస్తూ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆయనతో పాటు నుడా చైర్మన్ కేశ వేణు,నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, తదితరులు ఉన్నారు.

MLA Sudarshan Reddy visits Pramod's family