బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజక వర్గ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరగాయల పంటల సాగు వాటిపై ప్రభుత్వం అందించే రాయితీలపై రైతులతో చర్చించారు. రైతులు పంట సాగుకై ఆమోదిస్తూ తమ పేర్లను నమోదు చేసుకోగా అందుకు సంబంధించిన రాయితీపై రుణ సదుపాయం చెక్కుల పంపిణీకై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ గడువు గంగాధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి, ఏసిపి శ్రీనివాస్, సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు ఏఎంసీ కమిటీ సభ్యులు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
