పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 బతుకమ్మ, బోధన్ : సాలురా మండలంలోని ఖాజాపూర్ గ్రామ పరిసరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంజీరా నదీ ప్రవాహం పెరిగి, రైతుల సోయా పంటలు నీట మునిగాయి. దీంతో రైతులకు గణనీయమైన నష్టం సంభవించింది. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఖాజాపూర్ శివారులో పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయనతో పాటు వ్యవసాయ అధికారులు కూడా పంట పరిస్థితులను పరిశీలించారు. త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇస్తూ, ప్రభుత్వం నుండి తగిన...