నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ భవనంను మాజీ మంత్రి, బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్ సినీయర్ సిటిజన్స్ భవనంను సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు అసోసియేషన్ భాధ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు…. పెన్షనర్స్ సినీయర్ సిటిజన్స్ యొక్క యోగ క్షేమాలకు ప్రభుత్వం ప్రాధన్యత ఇస్తుందని అన్నారు. ఈ సంధర్బంగా అసోసియోషన్ బాధ్యులు ఇచ్చిన వినతుల పరిష్కరంకు పాటు పడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రాంమోహన్ రావు తో పాటు కార్పొరేషన్ ల చైర్మెన్ లు మానాల మోహన్ రెడ్డి, తాహేర్ బిన్ హందాన్ తదితరులు పాల్గోన్నారు.
