Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:21 pm Posted by : ramakrishna

ఆపదల్లో ఉన్న వారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

 

లింగం పేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండలం రాంపల్లి స్కూల్ తండా గ్రామానికి చెందిన దేఘావత్ సంతోష్ ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సంతోష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అతనికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సంతోష్‌కు అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే కి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి అండగా నిలుస్తూ, వారి ఆరోగ్య సంక్షేమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మానవతా దృక్పథాన్ని స్థానిక ప్రజలు అభినందించారు.

 

MLA stood by those in distress.