Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 8:48 pm Posted by : ramakrishna

చెరువు కట్ట పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ శివారులోని మల్లారం చెరువు కట్ట మరమ్మతు పనులకు మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పనులు ప్రారంభించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా మల్లారం చెరువు కట్ట వరద తాకిటికీ కోతకు గురైంది. వరద నష్టం మరమ్మత్తు నిధుల కింద రూ.1.65 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో గ్రామ రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగు పడడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్ల సాయిరాం యాదవ్ తో పాటు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

MLA starts pond construction work