కాళేశ్వరం, బతుకమ్మ : రాష్ట్రంలో కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం కాళేశ్వరం త్రివేణి సంఘమం వద్ద కుటుంబ సమేతంగా పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.