Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 10:34 am Posted by : ramakrishna

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్..

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా తప్పుబట్టారు. ఈసందర్భంగా ఆయన ’ఎక్స్‘ వేదికగా స్పందించారు. ’తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా తన శక్తి కొద్దీ పని చేస్తూనే ఉంది. వారిని దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియాను ఎగదోయడం విభజించి పాలించడమే అని, ఈ కుటిల పన్నాగాలను సమాజం సహించదు‘ అని రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.


MLA Rajagopal Reddy's sensational tweet..