Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 2:42 pm Posted by : ramakrishna

నామినేషన్ వేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పలు పార్టీల నేతలు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఈకార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజ్ శ్రావణ్ నామినేషన్ వేశారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని తదితరులు పాల్గొన్నారు.

MLA quota MLC candidates who filed nominations