Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 6:29 pm Posted by : ramakrishna

గాండ్లపేట్ వద్ద గండి పై విషయాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి*

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కేనాల్ కు గండి పడి పెద్ద ఎత్తున నీరు కిందికి లీక్ అవుతుండటంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎస్సారెస్పీ ఎస్సీ జగదీశ్వర్ జగదీశ్,  ఎఫ్ఎఫ్సీ (ఫ్లడ్ ఫ్లో కేనాల్ ) ఈఈ లతో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విషయాలు అడిగి తెలుసుకున్నారు. గండి పడటానికి గల కారణాలను అధికారులను అడుగగా.. మొన్న భారీ వర్షాల వల్ల వచ్చిన వరదతో అక్విడేక్ట్ డౌన్ స్ట్రీమ్ లో వరద కెనాల్ మట్టి కొట్టుకపోవడంతో గండి పడి ఉంటుంది అని అధికారులు తెలిపారు.వరద కెనాల్ గేట్లు మూసి ఉన్నాయని వరద కేనాల్ లో నీటి నిల్వ తగ్గిన తర్వాత సమస్య ను కనుక్కొని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని,ప్రస్తుత మున్న ఎఫ్ఎఫ్సీ అక్విడెక్ట్ స్ట్రక్చర్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ఎమ్మెల్యేకు తెలియజేసారు. సమస్య కనుగొన్నాక మళ్ళీ నాకు సమాచారము అందించాలని అవసరమైనతే పై అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలియజేశారు.