గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 85వ నూతన శాఖను బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బందికి, కమ్మర్‌పల్లి మండల ప్రజలకు ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ సాధించిన ప్రగతిని అభినందించారు. 2000 సంవత్సరంలో...