ఘనంగా ఎమ్మెల్యే పోచారం జన్మదిన వేడుకలు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద మంగళవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 77 వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, నాయకులు పత్తి రాము, నెరుగంటి...