Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 5:57 pm Posted by : ramakrishna

ఘనంగా ఎమ్మెల్యే పోచారం జన్మదిన వేడుకలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద మంగళవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 77 వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజ్, పత్తి లక్ష్మణ్, పట్టేపు రాములు, సిద్దాపూర్ మాజీ సర్పంచ్ సంతోష్, తోట సంగయ్య, జమీల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.