Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 7:06 pm Posted by : ramakrishna

ఆషాడం బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

 

 బాన్సువాడ, బతుకమ్మ :

ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనం సమర్పించారు.  బాన్సువాడ పట్టణంలో సంగమేశ్వర కాలనీ లో ఆషాఢ మాసం బోనాల పండుగ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో ఊరూరా బోనాల పండుగ నిర్వహించి, ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారని ఆయన అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేశ, విదేశాల్లో కూడా బోనాల పండుగ ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శంభు రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి,కాసుల రోహిత్ తదితరులు పాల్గొన్నారు..

MLA Pocharam, who was delighted with the outcome