108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 108 నూతన అంబులెన్స్ ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 108 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆసుత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల...