Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 5:15 pm Posted by : ramakrishna

108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 108 నూతన అంబులెన్స్ ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 108 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని  అన్నారు. అదేవిధంగా ఆసుత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నడిపింటి నాగేష్, పత్తి లక్ష్మణ్, కుర్మాజీ సాయిలు, షేక్ ఖాదర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అయోషా సిద్దిక, ఆసుపత్రి సిబ్బంది, 108 అంబులెన్సు సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MLA Pocharam who started 108 Ambulance