Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 8:01 pm Posted by : ramakrishna

సామూహిక మహా మండల పూజ కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం.

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర వ్యవసాయ సలహా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం సాయంత్రం ఆంజనేయ స్వామి దీక్షా స్వాముల 17వ మహా మండల పూజ కరపత్రాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కరకములచే ఆవిష్కరించారు. మార్చి 21న విశ్వశాంతి కొరకు అష్టోత్తర శత కుండాత్మక (108) సుందరకాండ పారాయణ సహిత 162 వ హనుమాన్ మహా యజ్ఞం, శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వడల పూజ మహోత్సవం చేపట్టుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుందరకాండ పారాయణ సహిత మహా యజ్ఞం మార్చ్ 21 న శనివారం నాడు ప్రారంభమై 22 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ మహోత్సవంలో హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ ప్రతినిధులు అంబిలిపూర్ రాజు స్వామి, పాలకుర్తి దత్తు స్వామి, తులసి రామ్ మారుతి స్వామి, కల్లేటి వెంకటరమణ స్వామి, నరేష్ స్వామి, విజయ స్వామి, ప్రశాంత్ రెడ్డి స్వామి, శ్రీనివాస్ స్వామి, వేణుగోపాల్ రెడ్డి స్వామి, మహేష్ స్వామి, శివరాజ్ స్వామి, అర్జున్ స్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.