Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 7:24 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి

  • ఎన్నికల కమిషనర్ కు సోమశేఖర్ రావు ఫిర్యాదు

 

హైదరాబాద్, బతుకమ్మ : బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినందు వల్ల అతనిపై అనర్హత వేటు వేయాలని జాతీయ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు సోమశేఖర్ రావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఏ) ప్రకారం తక్షణం అనర్హత వేటు వేసి చర్యలు తీసుకోవాలని సోమశేఖర్ రావు కోరారు.