మహాలక్ష్మి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, బాన్సువాడ :తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమమే ధేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా కల్పించారని, దీని కోసం ఇప్పటివరకు రూ. 6.680 కోట్లు కేటాయించారని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన మహాలక్ష్మి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేవలం ఆధార్ కార్డు ఉంటే మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని...