Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 5:36 pm Posted by : ramakrishna

మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష సమావేశం

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో, వార్డు అధికారులతో  పారిశుద్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఈ సమావేశంలో వార్డు అధికారులతో మాట్లాడుతూ వార్డులలో  డ్రైనేజీ వ్యవస్థలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇది మురికి, వ్యర్థాలు మరియు ఇతర అడ్డంకులు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.తద్వారా అధిక వర్షపాతం ద్వారా వచ్చే నీరు సాఫీగా ప్రవహించేలా చేస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొనే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,వార్డు అధికారులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MLA Pocharam review meeting with municipal officials