Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 3:21 pm Posted by : ramakrishna

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో  ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ  కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,అటవీ శాఖ సబ్ డీఎఫ్ఓ, బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, ఎస్ఆర్ఎన్కేకాలేజ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు, ఇతర అధికారులు, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్ఆర్ఎన్కే కాలేజ్, నర్సింగ్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

MLA Pocharam plants saplings at government degree college