బాన్సువాడ, బతుకమ్మ :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా మంగళవారం నిర్వహించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు,బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి,పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం భారతదేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్. కోట్ల జనాభాతో, విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో కూడిన భారతదేశంలో నేడు పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతూ, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే అది రాజ్యాంగ స్పూర్తి అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ భారత నిర్మాణానికి బాటలు వేద్దాం అని తెలిపారు.