Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 6:29 pm Posted by : ramakrishna

కల్కి చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మరమ్మత్తు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ బుంగ మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం రూ. 27 లక్షల 60 వేలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. భవిష్యత్తులో మళ్లీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్కి చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మత్తులను వేగంగా పూర్తిచేసి నీటి వృధాను అరికట్టాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీచంద్, ఏఈ నితిన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మహ్మద్ ఏజాస్,ఎర్వల కృష్ణారెడ్డి, నార్ల సురేష్ , నార్ల రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.