ఏరియా ఆస్పత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పని వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఇజస్, ఖలేఖ్, లింగం,అఫ్రోజ్ తదితరులు ఉన్నారు.