బతుకమ్మ , బాన్సువాడ : విజయదశమి పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించానున్న రావణ దహన కార్యక్రమం ఏర్పాటును రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. పట్టణ కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో రావణ దహనం సందర్భంగా ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
