ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ, బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా జూన్ నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందేలా చూడాలని పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో...