ఇందిరమ్మ హౌసింగ్ అధికారులుతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పనులు నెమ్మదిగా జరుగుతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులతో...