Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 4:34 pm Posted by : ramakrishna

డివిజన్ టాపర్​ను సన్మానించిన ఎమ్మెల్యే పోచారం

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని వాసవి హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని సహస్ర 576 మార్కులతో డివిజన్ టాపర్​గా నిలవడంతో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం అభినందించారు. బాన్సువాడ డివిజన్ టాపర్​గా నిలవడంతో వాసవి స్కూల్, తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మంచి మార్కులు సాధించడంతో యాజమాన్యం రూ. 11 వేలు బహుమతి ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం మోటమర్రి నాగరాజు, రామకృష్ణ, విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత, ఉపాధ్యాయులు జలీల్, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.