పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర...