బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివాలయం నుండి గణనాథుని శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగుతోంది ఈ శోభాయాత్రలో డప్పులు, కీర్తనలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని భక్తులతో కలిసి వినాయకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రజలతో మమేకమై వారిని ఉత్సాహపరిచారు. ఈ శోభాయాత్రలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, తాసిల్దార్ విట్టల్, సరోజని కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని శోభాయాత్ర కొనసాగుతుంది.
