విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

  భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నాయకమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి రమణారెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారన్నారు. అనంతరం స్థానిక భక్తులు, పూర్వ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతిష్టాపన మహోత్సవంలో వేడుకలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ...