Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 11:54 am Posted by : ramakrishna

 కార్యకర్తను వేధించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సొంత పార్టీ కార్యకర్తను వేధింపులకు గురిచేశాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి శ్రీనివాస్, పార్టీ మీద అసంతృప్తి కారణంగా 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు.  ఈనెల 12న “మా ఊరికి వేయిస్తానన్న బస్సు ఏమైంది” అంటూ బండారి శ్రీనివాస్ సోషల్ మీడియాలో  పోస్టు పెట్టారు. 13న బండారి శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్‌కు ఎస్సై పిలిపించారు.  12 గంటల పాటు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి కొట్టాడని ఎలుకల మందు తాగి  శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశారు. మరోసారి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని మల్యాల ఎస్సై బెదిరించాడు.